కోరుట్ల

మున్నురుకాపు సంఘం జిల్లా అధ్యక్షులు చెదలు సత్తన్నను సన్మానించిన డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com

August 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మున్నురుకాపు సంఘం జిల్లా నూతన అధ్యక్షులు గా ఎన్నికైన చెదలు సత్యనారాయణ పటేల్ (సత్తన్న)ను తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ ఘనంగా సన్మానించారు.గురువారం పేట భాస్కర్ నివాసంలో ఈనెల 25 న జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్న చెదలు సత్తన్న నూతన కమిటీ ఆహ్వాన పత్రికను ఇచ్చేందుకు వచ్చిన సందర్భంగా… జిల్లా అధ్యక్షుడితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు బండారి శంకర్ పటేల్ ను పేట భాస్కర్ ఘనంగా సన్మానించారు. జిల్లాలో మున్నురుకాపు సంఘంను మరియు వివిధ కుల సంఘాలను ప్రజాసంఘాలను బలోపేతం చేసే దిశలో జిల్లా నూతన అధ్యక్షులు మరియు కార్యవర్గం ముందుకు వెళ్ళాలని పేట భాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో కోరుట్ల మున్నురుకాపు ఆమ్ సంఘం అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, మాదిగ కుల సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్, కాపు సంఘ నాయకులు అదే రాజన్న, మానాల. భూమయ్య, సుతారి నరేందర్, కోరవేణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button