కోరుట్ల
జన్మదిన వేడుకగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు టీ షర్ట్స్ పంపిణీ

viswatelangana.com
June 18th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త నీలి కాశీనాథ్ జన్మదిన వేడుకగా తక్కలపల్లి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు స్పోర్ట్స్ టి షర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నీలి కాశీనాథ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు కే శ్రీహరి చొరవతో ఈ యొక్క జన్మదిన వేడుక పాఠశాలలోని పిల్లల మధ్యన జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పిల్లలకు నా తరఫునుండి చిరు కానుకగా టీ షర్ట్ పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలుపుతూ ముందు ముందు పాఠశాల ఎదుగుదలకు విద్యార్థులు బావి భారత పౌరులుగా ఎదగడానికి నా వంతు సహాయం ఎల్లవేళలా ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త ఏ హెచ్ ఈ ఏ డి వైస్ ప్రెసిడెంట్ నీలి సుజిత్, తూమ్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



