ముస్లింలు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా? – ముహమ్మద్ ముజాహిద్

viswatelangana.com
యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ముహమ్మద్ ముజాహిద్ మాట్లాడుతూ, “ముస్లింలు కేవలం ఓటు బ్యాంక్ మాత్రమేనా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ముజాహిద్ మాట్లాడుతూ, తెలంగాణలో 16% ముస్లింలు ఉన్నప్పటికీ, వారికి తగిన ప్రాధాన్యత, హక్కులు దక్కడం లేదని తీవ్ర విమర్శలు చేశారు.త్వరలో తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులో ముస్లింలకు చోటు ఇవ్వకపోవడం తీవ్ర అన్యాయం అని ముజాహిద్ మండిపడ్డారు. బీసీ మైనారిటీ సంక్షేమ సంస్థ (దుదేకుల, నూర్బాష్, పంజారి, అన్సారి, మన్సూరీ).తెలంగాణ తుర్కాకశ సంక్షేమ సంఘం. రీజినల్ ముస్లిం ఫెడరేషన్ (ఆర్ ఎం ఎఫ్ ),తెలంగాణ సంచార ముస్లిం తేగల సంఘం, తెలంగాణ ముస్లిం ఫకీర్ బీసీ -ఈ సంక్షేమ సంఘం. తెలంగాణ నూర్‌బాషా దుదేకుల ముస్లిం సంక్షేమ సంస్థ.ముస్లింల హక్కుల కోసం పోరాడతామని, వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా చూసే రాజకీయాలకు ఇక సమయం ఆసన్నమైందని ముజాహిద్ స్పష్టం చేశారు.



