
viswatelangana.com
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని కట్లకుంట గ్రామంలో శనివారం రోజు అర్థరాత్రి తాళం వేసిఉన్న రాం రెడ్డి, కథలాపూర్ రాధ ల ఇండ్లలో దొంగలు ఇండ్ల తాళాలను పగులగొట్టి బారి చోరీ చేశారు. రాంరెడ్డి ఇంటిలో కుటుంబ సభ్యులు రాంరెడ్డి భార్య హారిక వారి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. రాంరెడ్డి ఉపాది నిమిత్తం గల్ఫ్ లో ఉంటున్నాడు. శనివారం రోజు కుటుంబ సభ్యులు వేములవాడ, కొండగట్టు దైవ దర్శనానికి వెళ్లివచ్చి రాత్రి ఇంటికి తాలంవేసి తల్లిగారి ఇల్లు అయిన జోగిన్ పల్లి కివెళ్ళారు. కథలాపుర్ రాధ ఇంటిలో కూడా ఎవరూ లేకపోవటంతో తాళం వేసి ఉన్న రెండు ఇండ్లలో భారీ చోరి కి తెగబడ్డారు. కథలాపూర్ రాధ ఇంటిలో 3 గ్రాముల బంగారం, రాంరెడ్డి ఇంటిలో 12తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు, 15 వేల నగదు రూపాయలు పోయినట్లు భాదితులు తెలిపారు. రాధ, హారికల పిర్యాదు మేరకు డీ ఎస్పీ ఉమామహేశ్వర రావు, కథలాపూర్ ఏస్ ఐ నవీన్ లు సంఘటన స్థలానికి చేరుకొని క్లూస్ టీం తో విచారణ చేపట్టారు




