రాయికల్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిరసన

viswatelangana.com

May 6th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేసి డీజిల్‌ పోసి కాల్చి చంపేందుకు ప్రయత్నించిన అమానుష చర్యను నిరసిస్తూ ఒడ్డలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నిరసన తెలిపారు. ఈ అనాగరిక చర్యను ఒడ్డెలింగాపూర్ పిహెచ్‌సి సిబ్బంది ఖండిస్తున్నాము.నిందితులందరినీ వెంటనే అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ చట్టం కింద కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కస్తూరి సతీష్, సిహెచ్ఓ ప్రమీల, హెచ్ ఈ ఓ శ్రీనివాస్, సూపర్వైజర్ శ్రీధర్ ఏఎన్ఎంలు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button