కథలాపూర్
కథలాపూర్ లో కోరుట్ల ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

viswatelangana.com
October 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పుట్టినరోజు సందర్బంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి స్వీట్ పంపిణీ చేసిన మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమం లో మండల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్ రావు, మాజీ డైరెక్టర్ సబ్బని గంగు, మాజీ ఎంపీటీసీ మామిడి పెల్లి రవి,బి ఆర్ ఎస్ పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షులు కల్లెడ శంకర్,రిక్కల సంజీవ్, ముస్కరి కిరణ్, నల్ల గంగారెడ్డి, వల్లకొండ ప్రసాద్, ధనుంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



