కోరుట్ల
కాంగ్రెస్ లో చేరేందుకు గాంధీభవన్ తరలి వెళ్తున్న బిజెపి బిఆర్ఎస్ నేతలు..

viswatelangana.com
April 16th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
- రోజురోజుకు కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి కి పెరుగుతున్న ఆదరణ
కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జంగిలి వెంకటి ఇబ్రహీంపట్నం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు జంగిలి సునీత ఆకుల లింగారెడ్డి భారత రాష్ట్ర సమితికి చెందిన ఇబ్రహీంపట్నం మండల పరిషత్ మాజీ అధ్యక్షులు నేరెళ్ల దేవేందర్ తోపాటు భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీ కి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు జువ్వాడి నర్సింగరావు నాయకత్వాన్ని బలపచేందుకు గాంధీభవన్ కు తరలి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా జెండా ఊపి బస్సును ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



