రాయికల్

శ్రీలంక అమ్మాయి తెలంగాణ అబ్బాయిఎల్లలు దాటిన ప్రేమ ఒక్కటైన వేళ.

viswatelangana.com

April 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
  • హిందూ సాంప్రదాయపద్ధంగా ఘనంగా వివాహం
  • హాజరైన ఎమ్మెల్యే సంజయ్.

ప్రేమకు అవధులు లేవు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ జంట. శ్రీలంకలో పుట్టిన అమ్మాయి తెలంగాణలో పుట్టిన అబ్బాయి ఉపాధి నిమిత్తం విదేశాల్లో పనిచేస్తుండగా వారి మధ్య చిగురించిన ప్రేమ వివాహానికి దారి తీయ గా ఇరువురి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో నేడు కలియుగ దైవం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఒక్కటయ్యారు. అబ్బాయికి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో సొంత అక్క బావలు అండగా నిలిచి వరుడు పెళ్లిని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో మెట్పల్లి మండలం మూడు బొమ్మల మేడిపల్లి( పడమర) గ్రామానికి చెందిన జోరిగే అశోక్, శ్రీలంక దేశానికి చెందిన సమన్వి అలియాస్ మరియా లు స్వదేశాల్లో చదువుకొని ఉపాధి నిమిత్తము జోర్డాన్ దేశానికి వెళ్లగా వారిద్దరి మధ్య అక్కడే ప్రేమ చిగురించింది. వారు ఇరువురు తమ తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను ఒప్పించడానికి వారి వారి స్వస్థలాలకు తిరిగివచ్చారు.ఇదే నేపథ్యంలో అమ్మాయి సమన్వి తమ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ దేశంలో నివాసం ఉండగా వారి తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి అశోక్ నీ దుబాయ్ రప్పించేందుకు వీసాను పంపింది. అక్కడ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి అమ్మాయి వారి తల్లిదండ్రుల ప్రో ద్బలంతో భారతీయ సంస్కృతి పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఒప్పించారు. దీంతో వరుడు అశోక్ తన తల్లిదండ్రులు మరణించడంతో వారి అక్క బావ అయినా రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన చేగంటి శేఖర్,పూజిత లకు తెలపడంతో, వారు వదువు వరుడికి పెళ్లి చేసేందుకు ముందుకు రావడంతో, వదు వరులు ఇద్దరికీ అక్క బావ కుటుంబ పెద్దలుగా మారి హిందూ సాంప్రదాయ బద్ధంగా మండలంలోని భూపతిపూర్ గ్రామ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఘనంగా వివాహాన్ని జరిపించారు. ఇట్టి వివాహ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపి పిఎంపి మండల అధ్యక్ష కార్యదర్శులు చేగంటి శేఖర్, మచ్చ సందీప్, గ్రామ మాజీ సర్పంచ్ వాసరి రవి,మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, ఆర్ఎంపి పి.ఎం.పి మండల నాయకులు ఈదుల లక్ష్మణ్ కుమార్ గోవర్ధన్,స్థానిక ప్రెస్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button