కొడిమ్యాల
కొడిమ్యాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

viswatelangana.com
June 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం తో పాటు ప్రభుత్వ కార్యాలయాలల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాహసీల్దార్ మండలోజు కిరణ్ జాతీయ పతాకం జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలువేరి నారాయణ గౌడ్, మల్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ నర్సింగరావు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ నెంబర్లు గ్రామ ప్రజలు ఎంపీడీవో స్వరూప, ఏ ఓ పి జ్యోతి, రెవెన్యూ సిబ్బంది, తదిత అధికారులు పాల్గొన్నారు.



