కోరుట్ల

కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన జువ్వాడి నర్సింగరావు

viswatelangana.com

April 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు పూజ చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని కోరారు. మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి శేర్ నర్సారెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఆడెపు మధు, ఎంఏ.నయీమ్, మ్యాకల నర్సయ్య, గుర్రాల ప్రవీణ్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు .

Related Articles

Back to top button