ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగి ఉండాలి తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజరు శ్రవణ్ కుమార్

viswatelangana.com
దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో “ఫైనాన్షియల్ లిటరసీ – ఉమెన్స్ ప్రాస్పారిటి (ఆర్థిక అక్షరాస్యత మహిళల ఆర్థిక సమృద్ధి) అనే అంశంపై నిర్వహిస్తున్న నేపథ్యంలో సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు భూషణరావుపేట మేనేజరు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ధిక అక్షరాస్యతపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తూ ఆర్థిక వృద్ది సాదించాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్లకు ఎవరూ స్పందించవద్దని, తమ వ్యక్తిగత, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఏటిఎం కార్డు, పిన్,ఓటిపి నంబర్లు ఎవరితో కూడా చెప్పవద్దని అన్నారు. బ్యాంకు ఖాతా పొదుపు ఆవశ్యకత, సైబర్ నేరాలు, పీఎం ఎస్ బి వై,పీఎం జేజే బి వై,ఏపివై ల గురించి అవగాహన కల్పిస్తూ,రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పదని డబ్బును పొదుపు చేయడంలో మహిళలు ముందుంటారని అన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు భూషణరావుపేట మేనేజరు శ్రవణ్ కుమార్, బ్యాంకు సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



