కోరుట్ల డిపోలో కార్మికులను వేధిస్తున్న డిపో మేనేజర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

viswatelangana.com
- -జి.తిరుపతి నాయక్ సీపిఎం జిల్లా కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్లిస్టు (సీపిఐఎం ) జగిత్యాల జిల్లా కార్యదర్శి జి.తిరుపతి నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కరీంనగర్ రీజన్ లోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న డిపో కోరుట్ల డిపో. గత 33 సంవత్సరాల నుండి కార్మికులు ఎంతో ఆనందంగా పనిచేసుకుంటూ మంచి పేరు ఎంతోమంది రీజనల్ మేనేజర్లతోని డిపో మేనేజర్లతో మన్ననలు పొందిన డిపో. అంత మంచి డిపోను గత ఆరు నెలల క్రితం వచ్చిన డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బంది పెడుతూ ట్రాఫిక్ సూపర్వైజర్ గ్యారేజ్ సూపర్వైజర్ తో పాటు కార్మికులందరికీ ఒక్కొక్కరికి సంవత్సరం ఇంక్రిమెంట్ల కోతవిధించడం జరిగిందని అన్నారు. డిపో మేనేజర్ కి నలుగురు కార్మికులతో అండదండలతో డిపోలో వున్న కార్మికులను భయభ్రాంతులను గురిచేస్తున్నారని, కార్మికులు అనారోగ్యంతో గురయిన వారు బాధపడుతూ కరీంనగర్ డిస్పెన్సరీ హాస్పిటల్ పోవుటకు డిపో మేనేజర్ ఆఫీస్ కి లెటర్ తో వెళ్తే పర్మిషన్ ఇవ్వడం లేదని మా ఆఫీస్ కి వచ్చి కార్మికులు తమ బాధను చెప్పుకోవడం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో బస్టాండ్ లోని ఆన్ డ్యూటీలో వున్న ఎస్ఎం మేనేజర్ కు డిపో మేనేజర్ వేధింపులకు భరించలేక అనారోగ్యానికి గురి కావడం జరిగిందన్నారు. ఒక పక్కన ఉన్నతాధికారులు నియమ నిబంధనల ప్రకారం కార్మికులను వేధించరాదని ప్రభుత్వం చెప్తుంటే వారి సూచనలను కూడా తుంగలో తొక్కి డిపో మేనేజర్లు తన ఇష్టం వచ్చినట్లుగా కార్మికులను వేధిస్తున్నారు అన్నారు, ఓడి పేరుతో తాను అనుకున్నవారికి దగ్గరగా డ్యూటీ చేయడం జరుగుతుందని కోరుట్ల డిపోలో 37 బస్సులు ఉన్నాయి, కానీ 15 మంది డ్రైవర్లు మాత్రమే బస్సులను నడుపుతున్నారని తక్షణమే డ్రైవర్లను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున డిపోలో జరుపుకుంటామని అనుకుంటే కార్మికులకు పర్మిషన్ ఇవ్వడం లేదని అన్నారు. ఉన్నత అధికారులు డిపో మేనేజర్ పై న్యాయ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు



