రాయికల్

ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

viswatelangana.com

March 7th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు వివిధ రకాల పోటీలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్లాల లావణ్య, ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి స్వప్న, కోశాధికారి అయిత మాధవి తోపాటు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button