కథలాపూర్
క్విజ్ పోటీలో గెలుపొందిన ప్రభుత్వ పాఠశాల ఊట్ పల్లి విద్యార్థులు

viswatelangana.com
December 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ లెవెల్ 13 ప్రాథమిక పాఠశాలలకు చెందిన విద్యార్థులకు శుక్రవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఊట్ పల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి గెలుపొందగా, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎంఈఓ లోకిని శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం లో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు అర్జున్, రాజయ్య, ప్రాథమిక పాఠశాల హెచ్ ఎం లు సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, అల్లె పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.



