కథలాపూర్
వర్షాలు కురిసిన తర్వాతనే జనుము, జీలుగ వెయ్యాలి

viswatelangana.com
May 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సబ్సిడి పైన జనుము జీలుగు విత్తనాలు తీసుకెళ్ళిన రైతు లకు శుక్రవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి యోగిత తగుచూచనలు చేశారు. ప్రస్తుతం వాతవరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. వర్షాలు రావడానికి ఇంకా సమయం పడేటట్లుందని, తగినంత నేలలు పూర్తిగా తడిచేట్లు వర్షాలు నమోదు అయ్యాక మాత్రమే రైతులు జనుము, జీలుగ విత్తనాలు విత్తుకోవాలని తెలిపారు. వర్షం పడకుంటే విత్తనాలు మొలకెత్తవని, రైతులు దీనివల్ల ఆర్థికంగా విత్తనాలు నష్ట పోతారని, రైతులు అప్రమత్తంగా ఉండి వర్షాలు కురిసిన తర్వాతనే విత్తనాలను విత్తాలని మండల వ్యవసాయ అధికారి యోగిత సూచించారు.



