రాయికల్

గుడుంబా తయారీ చేసిన వ్యక్తుల బైండోవర్

viswatelangana.com

June 28th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం దావనపల్లికి చెందిన మాలోతు లక్ష్మి, ధర్మాజిపేటకు చెందిన లావుడ్య నాగరాజు, లావుడ్య గంగాధర్ లను అబ్కారీ సిఐ సర్వేశ్వర్ శుక్రవారం తహశీల్దార్ అబ్దుల్ ఖయ్యూం ఎదుట బైండొవర్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్ లో గుడుంబా తయారీ చేస్తే లక్ష రూపాయలు జరిమానా, జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం రాష్టాన్ని గుడుoబా రహిత రాష్ట్రంగా చేయాలన్న నిర్ణయంలో భాగంగా బైండొవర్ చేసినట్లు గుడుంబా తయారు చేసిన, సరాఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అబ్కారి ఎస్సై రాజేందర్, కానిస్టేబుల్ మమత, అబ్దుల్లా, సిబ్బంది తదితరులున్నారు.

Related Articles

Back to top button