Local
మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం అందజేసిన వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు

viswatelangana.com
June 12th, 2024
Local (విశ్వతెలంగాణ) :
వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల కొరకై గత ప్రభుత్వం రెండు వందల డబల్ బెడ్రూంలు నిర్మాణం చేయడం జరిగింది. వరంగల్ తూర్పు జర్నలిస్టుల కొరకై నిర్మించిన 200డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన తరువాత, ఎన్నికల కోడ్ రావడం వలన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వలేకపోయారు. జర్నలిస్టుల కోసం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లను వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు పంపిణీ చేయాల్సిందిగా, వరంగల్ తూర్పు జర్నలిస్టులు మంత్రి కొండా సురేఖకు వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ సానుకూలంగా స్పందించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని త్వరలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని, సంబంధిత అధికారులతో మాట్లాడి జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూములు వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.



