గుల్లకోట ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఏకగ్రీవం

viswatelangana.com
ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, జగిత్యాల జిల్లా ఎమ్మార్పీఎస్ కమిటీ ఆదేశాల మేరకు శుక్రవారం గుల్లకోట గ్రామంలో ఎమ్మార్పీఎస్ మరియు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నూతన కమిటీని ఎండపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు చెన్న కుమార స్వామి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులుగా ఓరుగంటి నాగేష్, ఉపాధ్యక్షులుగా జంగిలి లచ్చయ్య, ప్రధాన కార్యదర్శిగా రామగిరి వెంకటేష్, అధికార ప్రతినిధిగా మిట్ట నరేష్, కోశాధికారిగా ఉప్పులేటి సాయికిరణ్, ప్రచార కార్యదర్శిగా దావుల నారాయణ, కార్యదర్శిగా ఉప్పలేటి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిలుగా జంగిలి లక్ష్మణ్, రామగిరి సురేష్, గౌరవ అధ్యక్షులుగా చుంచు మల్లేశం, సలహాదారులుగా జంగిలి రమేష్, చుంచు శంకర్, ముఖ్య సలహాదారులుగా దావుల దామోదర్ కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


