గృహజ్యోతి పథకం – పేదలకు వరం
కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో ఆదివారం రోజున గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం విద్యుత్తు అధికారులతో కలిసి కోరుట్ల నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భం గా కోరుట్ల నియోజక యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా పాటిస్తుందని, బడుగు బలహీన వర్గాలకు అండగా వుండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 6 గ్యారంటిలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది, ఇక తాజాగా ఫిబ్రవరి 27న రూ. 500 కే గ్యాస్ సిలిండర్, పేద మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను అమల్లోకి తీసుకొవచ్చింది, ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు తమకు ఓటు వేశారని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఎంపీ ఎలక్షన్ అధిక మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కి పట్టం కట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు జే.ఎల్.ఏం నరేష్, మెండే రాజేందర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అద్యక్షులు బిట్కు సహదేవ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తేలు రాజ్ కుమార్, ఇంద్రాల హరీష్,ముత్యపు రాజ శేఖర్, బోయిని రమేష్, ఇంద్రాల అశోక్, తేలు రాజుకుమార్, తేలు శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు



