రాయికల్
గ్రామదేవతలకు బోనాలు

viswatelangana.com
June 19th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లోని కుమ్మర శాలివాహన సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని గ్రామదేవతలకి బోనం సమర్పించడం ఆనవాయితీ గా వస్తున్నది. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, పాడి ,పంట సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో, సమృద్ధిగా కురిసి పంటలు పండాలని గ్రామ దేవతలను వేడుకున్నారు.ఇలా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోసంఘము అధ్యక్షులు కొత్తపెల్లి గంగారాం, ప్రధాన కార్యదర్శి గంగాధరి సురేష్, కోశాధికారి కొత్తపల్లి గంగాధర్, సంయుక్త కార్యదర్శి తుంపేట రాజు, సంఘ సభ్యులు గంగాధరి రాజేశం గంగాధరి నందు, కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



