భీమారం
ఘనంగా ముందస్తు హోలీ పండుగ సంబరాలు.

viswatelangana.com
March 23rd, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
భీమరం మండల కేంద్రంలో సిద్ధార్థ ప్రైవేట్ స్కూల్లో ముందస్తు హోలీ పండుగ వేడుకలు నిర్వహించారు. పిల్లలు ఆటపాటలతో రకరకాల రంగులతో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలతో ప్రతి యేట భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రకారం అన్ని రకాల పండుగలను పిల్లలతో జరుపుతామని సంస్కృతి సంప్రదాయాలతో కూడిన విద్యను నేర్పిస్తామని మంచి విలువలతో విద్యను అందిస్తూ సమాజంలోని స్థితిగతులను అధ్యయనం చేసే అలవాటును నేర్పుతామని కరస్పాండెంట్ పల్లికొండ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యజమాన్యం పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



