కథలాపూర్
చింతకుంట లో ట్రాక్టర్ ట్రాలీ పడి మహిళ దుర్మరణం
viswatelangana.com
February 26th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామ శివారులో ట్రాక్టర్ ట్రాలీ పడి, అదే గ్రామానికి చెందిన వేముల పోశవ్వ(52) మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం… పోశవ్వ సోమవారం ట్రాక్టర్లో లో మట్టి నింపే పనికి వెళ్లింది.సాయంత్రం ట్రాక్టర్ వెనక టైరు వద్ద మట్టిని తవ్వి నింపుతుండగా డ్రైవర్ రాము ముందుకు పోనిచ్చాడు. దీంతో ట్రాలీతోపాటు మట్టి పోశవ్వపై పడింది.ఆమె స్పృహతప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం కోరుట్ల ఆస్పత్రికి తరలిస్తుండగా మృ తిచెందింది. మృతురాలి భర్త గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.



