కథలాపూర్
టూవీలర్ ని ఢీకొట్టిన డీసీఎం వ్యాను – కేసు నమోదు చేసిన ఎస్సై
viswatelangana.com
April 30th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో ఇనాయత్ నగర్ నుండి టూవీలర్ బండి పై కథలాపూర్ వైపు వస్తున్న గైని అరవిందు అను వ్యక్తికి ఎదురుగా వస్తున్న ఒక డీసీఎం వ్యాన్ నడుపుతున్న డ్రైవర్ అట్టి వ్యానును ఆజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా నడుపుతూ బండి నడుపుతున్న వ్యక్తికి టక్కర్ ఇవ్వగా అతని కుడి కాలుకు తీవ్ర గాయమై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడని తన తండ్రి గైనీ లింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనదని కథలాపూర్ ఎస్సై జి.నవీన్ కుమార్ తెలిపారు.



