ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యం పంపిణీ
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

viswatelangana.com
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నరసయ్య తో కలిసి గుండంపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని అమలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజోజి సదానంద చారి, మాజీ కేడీసీసీ డైరెక్టర్ గంగాధర్ గౌడ్, మాట్ల సోమయ్య, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



