కోరుట్ల
చేనేత పద్మ సమైక్య పట్టణ అధ్యక్షులుగా కటుకం గణేష్ నియామకం

viswatelangana.com
January 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
చేనేత పద్మ సమైక్య కోరుట్ల పట్టణ అధ్యక్షులుగా పట్టణానికి చెందిన కటుకం గణేష్ ను నియమిస్తూ రాష్ర్ట అధ్యక్షులు కొండా రాం మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధికార ప్రతినిధి రాంపల్లి బాలరాజు శుక్రవారం కటుకం గణేష్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కంటం ఉదయ్ కుమార్ నేత, కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జి గజ్జెల్లి గణేష్, కోరుట్ల మండల అధ్యక్షులు గుండేటి సంతోష్ పాల్గొన్నారు.



