జిల్లా పాస్టర్ అసోసియేషన్ హడక్ కమిటీ ఎన్నిక

viswatelangana.com
గడిచిన 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న జగిత్యాల జిల్లా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం నూతన జిల్లా కమిటీ ఎన్నిక కోసం హడక్ కమిటీ ఎన్నుకున్నట్లు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పాస్టర్ గసికంటి సమూయేలు,వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏలీయా మెంగు,కోశాధికారి గిధ్యోను లు తెలిపారు..మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ కమ్యూనిటీ హాల్ లో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా జిల్లా కమిటీ బాధ్యులు మాట్లాడుతూ జిల్లా నూతన కమిటీ ఎన్నిక కోసం హడక్ కమిటీలో ఐదుగురు పాస్టర్లను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 20 మండలాల అధ్యక్ష, సెక్రటరీ ల సమక్షంలో హడక్ కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు..గత కమిటీ చేపట్టిన అనేక కార్యక్రమాలు వివరాలు వెల్లడించారు.. నూతన జిల్లా పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఎన్నికకోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిచర్య కొనసాగిస్తున్న పాస్టర్లు తరలిరావాలని పిలుపునిచ్చారు.. ఎన్నికల తేదీ, సమయమును జూన్ 16 తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు.



