కొడిమ్యాల

నాచుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

viswatelangana.com

June 19th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల నాచుపల్లి గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలలోనీ విద్యార్థులకు అనంతరం నాచుపల్లి. నవాబ్ పేట. మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు గురువారం కొండగట్టు గిరిప్రదక్షిణ.హనుమాన్ సేవా సమితి సభ్యులు, ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండగట్టు గిరి ప్రదర్శన వ్యవస్థాపకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ హనుమాన్ సేవా సమితి సభ్యులు, నాచుపల్లి మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాంపల్లి రాజేశం ఉపాధ్యాయులు సుధీర్ నవాబ్ పేట మండల పరిషత్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాధవి ఉపాధ్యాయులు సిహెచ్ రామక్రిష్ణరెడ్డి ఉపాధ్యాయురాలు లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button