viswatelangana.com
భీమారం మండలం వెంకట్రావు పేట గ్రామంలో జీడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా వేములవాడ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చలిమెడ లక్ష్మి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా పరిధిలోని వివిధ రంగాలలో సేవ కార్యక్రమాలు నిర్వహించిన 100 మందికి పైగా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు ప్రతినిధులకు అలాగే అధికారులకు ప్రజాప్రతినిధులకు సంస్థ నిర్వాహకులు అంగడి ఆనంద్ కుమార్ లక్ష్మీనరసింహారావు చేతుల మీదుగా మెమొంటో అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పి వైస్ చైర్మన్ వద్దులేని హరిచరణ్ రావు పాల్గొన్నారు..నూతన కార్యవర్గానికి సన్మానం.. అనంతరం నూతనంగా ఏర్పడిన ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని లక్ష్మి నరసింహారావు, జీర్డ్స్ సంస్థ అధ్యక్షులు అంగడి ఆనంద్ కుమార్ మెమొంటో అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నోముల నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు మార్గం మహేష్, ప్రధాన కార్యదర్శి పుప్పాల రాంరెడ్డి, కార్యదర్శి నీలగిరి ప్రవీణ్, కోశాధికారి ఎదులాపురం దయాకర్, కార్యవర్గ సభ్యులు మామిడి ఆంజనేయులు, కుందారపు ప్రభాకర్, ఎండి రఫీ,ఎండి రహీం,గోడికే సాయి కృష్ణ, బొంగొని మల్లేశం గౌడ్, చిరుమల్ల వజ్రలింగం, మరంపెల్లిసురేష్,బక్కురి నరేష్, పల్లికొండ గణేష్, పుల్లురి దేవయ్య, వెల్మలపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.



