మెట్ పల్లి
డి.ఎస్.పి ఆకస్మిక తనికి..
viswatelangana.com
February 23rd, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు శుక్రవారం రోజున మేడిపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ రికార్డ్స్, పరిసరాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది వారి విధుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాధితులకు తగు న్యాయం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంట కోరుట్ల సీఐ ప్రవీణ్, సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.



