కొడిమ్యాల
తుర్కషి నగర్ లో శివారులో లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

viswatelangana.com
July 6th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని సంద్రాలపల్లి గ్రామానికి చెందిన బుచ్చిబాబు ప్రతిరోజు కూలి నిమిత్తం గంగాధర ఎక్స్ రోడ్లో కూలి పనిచేయటానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు బుచ్చిబాబుకి తిరుపతి, చంద్రగిరి వర్షిత్, వద్దకు పని నిమిత్తం బుచ్చిబాబు వరుసకు అతనికి కొడుకు అయినా జూపాక మారుతితో కలిసి స్కూటీపై తిరిగి పని ముగించుకొని వస్తుండగా మార్గమధ్యలో తుర్కాష్ నగర్ వద్ద లారీ డి కొట్టడంతో నెంబర్, ఏపీ07 టిఎఫ్ 8768 నంబరు గల లారీ అతివేగంగా వచ్చి స్కూటీని డి. స్కూటీ పైన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అవడంతో వెంటనే 108 అంబులెన్స్ లో కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగినది. విషయం తెలుసుకున్న కొడిమ్యాల ఎస్సై సౌధం సందీప్, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.



