భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చినప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com
ప్రపంచంలోనే లిఖితపూర్వకంగా రచించిన అతిపెద్ద సర్వసత్తక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చినప్పుడే మహానీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నిజమైన నివాళులు అని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, అంబేద్కర్ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ అన్నారు. బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతోత్సవాలను పురష్కరించుకోని కోరుట్లలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణరావుతో కలిసి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ మహానీయుడు అంబేద్కర్ తన జీవితాన్ని తన కుటుంబాన్ని, తన వయస్సును లెక్క చేయకుండా దేశం కోసం, దేశంలోని పౌరులు అనగారిన ప్రజలకోసం సర్వస్వం త్యాగం చేసి అదించిన రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, అందుకే రాబోయే సమాజానికి రాజ్యాంగం పట్ల గౌరవం, దానిలోని విలువైన సమాచారం తెలియాలంటే పాఠ్యాంశాల్లో రాజ్యాంగం పెట్టడమే ఉత్తమమని చిన్న వయసునుండే అభ్యసించడం వల్ల యువతకు రాజ్యాంగం పట్ల పరిపూర్ణమైన అవగాహన పెరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పేట భాస్కర్ విజ్ఞప్తి చేశారు. తన వెంట వివిధ ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం, పసుల కృష్ణ ప్రసాద్, ఎలిశేట్టి గంగారెడ్డి, షాహేద్ మహ్మద్ షేక్, ఇట్యాల రాజేందర్, చింత భూమేష్ తదితరులు పాల్గొన్నారు.



