తులా రాజేందర్ కు డాక్టరేట్ పట్టా

viswatelangana.com
ఉద్యమకారుడు రచయిత తులా రాజేందర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి ‘పీహెచ్డీ’ పట్టా సాధించారు. తులా రాజేందర్ కుమార్ ‘లోయర్ మానేరు డ్యాం ముంపు గ్రామాల ప్రజల పునరావాసం – సామాజిక ఆర్థిక పర్యవసానాలు’ అనే అంశంపై పరిశోధన చేశారు. కరీంనగర్ పక్కన గల ఎల్ ఎం డి కింద కోల్పోయిన 18 గ్రామాల ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని ప్రొఫెసర్ పి పద్మనాభరావు ఆధ్వర్యంలో వాళ్ళ జీవన పరిస్థితులను అధ్యయనం చేశారు. పిహెచ్డి పరీక్ష లో నెగ్గినందున ఆయనకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పట్టాను ప్రధానం చేస్తున్నట్టు సార్వత్రిక విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ బి శ్రీనివాస్ ప్రకటించారు.తుల రాజేందర్ గతంలో తెలుగు ఎకాడమీలో ఉన్నతాధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత న్యాయవాద విద్యను అభ్యసించి ఎల్ ఎల్ ఎం పూర్తి చేశారు. గతంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన తుల ఉమ కు రాజేందర్ సహచరుడు.



