సమాచార హక్కు చట్టం అనుసరించి రికార్డుల పరిశీలన
viswatelangana.com
- నిధుల్లో భారీ అవకతవకలు
- సమాచారం ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం
- అర్జీదారుతునికి నాగరాజు
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లోని కుమ్మరి పెల్లి గ్రామంలో తునికి నాగరాజ్ ఆధ్వర్యంలో మర్రి నరేష్, ఉడుత ఆనందం, బోడుగం సత్యనారాయణ, వొళ్ళలా నవీన్, తునికి శ్రీను, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం గ్రామపంచాయతీ రికార్డుల తరికి నిర్వహించడం జరిగింది ఇట్టి తనిఖీలో భాగంగా వార్డు మెంబర్లు మూడుసార్లు గ్రామ సభకు వార్డ్ మెంబర్ల మీటింగ్ల కు గ్రామ ఏజెండాకు హాజరు కానట్లయితే సంబంధిత అధికారులు వారిపైన చర్యలు తీసుకోవాలి కానీ వారి పైన చర్యలు తీసుకున్నారో లేదో సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వలేకపోయారు అలానే గ్రామంలో మొరంపోయుట, సానిటేషన్, ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయంలో ఇతర కొన్ని పనులలో నిధుల అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసారు నాగరాజు బృందం అలానే గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్ కోసం 20 వేల రూపాయల చెక్కు వాడగా కమ్యూనిటీ టాయిలెట్స్ ఎక్కడ నిర్మించారో వివరణ కోరగా అలాంటివి ఏమీ నిర్మించబడలేదు డబ్బులు రిటన్ మళ్ళీ గ్రామపంచాయతీలోకి వచ్చినాయి రాలేవో తెలియదని నామమాత్రపు సమాచారం ఇవ్వగా వీటన్నిటి పట్ల పూర్తి సమాచారం కొరకు మరొకసారి రికార్డుల తనిఖీ నిర్వహిస్తానని నిధుల అవకతవకల గురించి పూర్తిస్థాయిలో పై అధికారుల ను సంప్రదిస్తానని తెలిపారు



