
viswatelangana.com
September 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
భావితరాలకు స్ఫూర్తిదాయకం చాకలి ఐలమ్మ జీవితం అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు.నియోజకవర్గ కేంద్రం అయిన కోరుట్ల పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నం లావణ్య అనిల్ తో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, ఎంబేరి నాగభూషణం, పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, రుద్ర శ్రీనివాస్, గంధం గంగాధర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు.



