రాయికల్
దేవాలయాలను దర్శించుకున్న గీత విద్యాలయం విద్యార్థులు

viswatelangana.com
February 22nd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా వాణి నగర్, గీతా విద్యాలయంలో చదువుతున్న చిన్నారులు శనివారం రోజున రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంను, రాయికల్ పట్టణంలో కొలువైన పంచముఖ లింగేశ్వర స్వామిని (గుడికోట) దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పంచముఖ లింగేశ్వర దేవస్థాన చైర్మన్ మచ్చ శ్రీధర్ చిన్నారులకు ప్రత్యేక దర్శనం కల్పించి పూజలు నిర్వహించి, అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గీతావిద్యాలయం మాతాజీలు, ఆచార్యులు విద్యార్థులు దేవాలయ చైర్మన్ కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.



