కథలాపూర్

ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలిమాజీ ఎంపీ, బిఆర్ఎస్ నేత వినోద్ కుమార్

viswatelangana.com

March 24th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

మాజీ ఎంపీ బిఆర్ ఎస్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఈ యాసంగి సీజన్ నుంచే వరి ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వా లని బిఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని తాండ్ర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో అబద్ధాలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు హామీలు అమలు చేసేందుకు సాకులు చెబుతోందని మండిపడ్డారు. చెరువులు, కుంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చినా పట్టించుకోకుండా చోద్యం చూస్తోందన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతుబంధు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ ఐదు రూపాయల పనిచేయలేదన్నారు. తనను గెలిపిస్తే ప్రజా సమస్యలపై గళం వినిపిస్తామన్నారు. సమా వేశంలో మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జెడ్పీటీసీ భూమయ్య, వైస్ ఎంపీపీ కిరణ్ రావు , తిరుజాని, కల్లెడ శంకర్, చెక్క పల్లి రాజుకుమార్, పాలెపు రాజేశ్, నల్ల గంగాధర్, జలంధర్, మంచాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button