కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కథలాపూర్ మండల కేంద్రంలో గల గాంధీ విగ్రహానికి పూల మాల వేసి, కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు, పూలు చల్లి, అయన దేశానికి చేసిన సేవల్ని గుర్తుచేస్తూ ఒక చెంప పై కొడితే మరో చెంప చూపించాలి అనే శాంతి యుత మార్గదర్శి గాంధీ జీ అని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో అనగా అహింస, సత్యమేవ జయతే, కుల మతాలకతీతంగా పరిపాలన విధానాల్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, ఎండి అజీమ్,వెలిచాల సత్యనారాయణ, రాష్ట్ర ఫిశర్మెన్ కార్యదర్శి కల్లెడ గంగాధర్, రాష్ట్ర చేనేతప్రధాన కార్యదర్శి పులి హరిప్రసాద్, జిల్లా కార్యదర్శి, గోపిడి ధనుంజయరెడ్డి, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కూన అశోక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, నారాయణరెడ్డి, అనంతరెడ్డి, లింగరావు, తలారి మోహన్, కూన శ్రీనివాస్, చిన్నారెడ్డి, తిరుపతిరెడ్డి, భైర మల్లేష్, వేముల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.



