రాయికల్

నిందితుని తక్షణమే అరెస్టు చేయాలి

viswatelangana.com

April 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 24వ తేదీ రోజు రాత్రి 10 గంటలకు రోడ్డుపైన వెళ్తున్న ఉదయ్ అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన అగ్రవర్ణ కులస్తు లైన ఓ వ్యక్తి దాడి చేసి కులం పేరుతో దూషించినట్లు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ అయినది అయిన ప్పటికీని నిందితున్ని అరెస్టు చేయకపోవడంతో ప్రెస్ మీట్ నిర్వహించామని తక్షణమే దాడి చేసి కులం పేరుతో దూషించిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు అట్టి వ్యక్తితో ప్రాణ భయం ఉన్నది అని, మాపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని ఇలాంటి చర్యలను ఖండిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కరంగుల వసంత కుమార్ అన్నారు తక్షణమే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరియు బాధితుడి కి అధికారులు న్యాయం చేయాలని మండల అధ్యక్షుడు రాజనాల మధు అన్నారు, ఈ కార్యక్రమంలో రామాజీపేట ఆలిండియా అంబేద్కర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button