కోరుట్ల
ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి

viswatelangana.com
March 16th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కోరుట్ల వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో గడిబూరుజు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తన జీవితాన్ని సైతం త్యాగం చేశారని, అంతటి మహనీయులు మన ఆర్యవైశ్యులైనందుకు మన కెంతో గర్వకారణమని అన్నారు. అనంతరం స్వీట్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో వనితా క్లబ్ అధ్యక్షురాలు నీలి గాయత్రి, కార్యదర్శి ముత్యపు మంజుల, కోశాధికారి గుడిసె శివజ్యోతి, ఉపాధ్యక్షురాలు మోటూరి అర్పణ, మంచాల రాధ, డిస్టిక్ ఆఫీసర్ నీలి లక్ష్మి, జోనల్ చైర్మన్ శ్రీపతి వాణి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.



