రాయికల్

స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు

viswatelangana.com

March 7th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణం లోని స్థానిక విశ్వశాంతి పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ కార్య్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ జాదవ్ అశ్విని , వైస్ చైర్ పర్సన్ గండ్ర రమాదేవి, మున్సిపల్ కౌన్సిలర్లు మ్యాకల అనురాధ, కల్లెడ సునీత,అన్వర్ బేగం, మీడియా జేఏసీ ప్రెసిడెంట్ వాసరి రవి పాల్గొన్నారు. జెడ్పీటీసీ జాదవ్ అశ్విని మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాలలో ముందుంటున్నారు దేశ రక్షణ విభాగంలో కూడా ఇప్పుడిప్పుడు మహిళలు చేరి దేశ సంరక్షణకి నడుంబిగించి తమ ధీరత్వాన్ని చాటుకుంటున్నారు. అలాగే మహిళలు కసిగా చదువుల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. వైస్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ఎక్కడ మహిళలు గౌరవించబడుతారో అక్కడ దేవతలు కొలువుదీరుతారు అంటూ మహిళలు మహిళ సాధికారత కొరకు విద్యావంతులు కావాలని ఉటంకించారు. ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ చిన్న పిల్లల స్థాయి నుండి వాళ్ళని పెంచి ప్రయోజకులను చేసే క్రమంలో మహిళ పాత్ర ఎంతో కలదని స్త్రీ లేకుంటే సృష్టే లేదని కుటుంబ వ్యవస్థలను సమర్థవతంగా మలచే క్రమంలో స్త్రీ పాత్రనే ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు లలిత , విద్యాన్వేష్ ,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వచ్చిన అతిథులు మహిళ పేరెంట్స్ ఉపాధ్యాయిని బృందం మ్యూజికల్ చైర్ మరియు ఇతర క్రీడల్లో పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం ముఖ్య అతిథులను సన్మానించి బహుమతులు ప్రదానం చేశారు అలాగే పేరెంట్స్, టీచర్స్ అందరికీ కూడా బహుమతులు ప్రధానం చేశారు

Related Articles

Back to top button