కోరుట్ల
నూతన మాస్టర్ ప్లాన్ , సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్ మెంట్
48 సర్వే పాయింట్లు , సర్వేలో పట్టణ ప్రజలు సహకరించాలి

viswatelangana.com
January 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణములో నూతన మాస్టర్ ప్లాన్ కొరకు డ్రోన్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్ మెంట్ ద్వారా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు పట్టణములో మున్సిపల్ ప్రత్యేక అధికారి బి. గౌతమ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఇట్టి సర్వేను ప్రారంభించారు. పట్టణములో 48 సర్వే పాయింట్ గుర్తించామని తెలియజేస్తూ ఇట్టి సర్వేకు పట్టణ ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. ఇట్టి కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ బి. తిరుపతి, టి.పి.ఓ ప్రవీణ్, మేనేజర్ శ్రీనివాస్, టిపిఎస్ రమ్య, గోపాల్ రావు డ్రోన్ సర్వేయర్ అలాగే కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.



