రాయికల్

పదోన్నతి పొందిన భాషోపాధ్యాయులను ఘనంగా సన్మానించిన వి.యం.ఆర్ ఫౌండేషన్ వంగ మహేందర్ రెడ్డి

viswatelangana.com

August 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ఉమ్మడి కరీనగర్ జిల్లా పరిధిలో ఈ మధ్యనే పదోన్నతి పొందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు, వివిధ సంఘాల జిల్లా బాధ్యులకు, తెలుగు, హిందీ, ఉర్దూ, వ్యాయామ ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం లకు, అన్ని కేటగిరీలలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు కరీనగర్ జిల్లా కేంద్రంలో గల జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పదోన్నతి పొందిన ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్, చంద సత్యనారాయణ, మడ్డి బాపు, చంద్రశేఖర్, వినోద్, సయీద్ పాషా, ఫక్రొద్దీన్, సైదుద్దీన్, ఎల్.ఎఫ్.ఎల్ హెచ్.ఎం.గా పదోన్నతి పొందిన జిల్లా గిరిజన ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నూనావత్ రాజు, హెచ్ం.ఎం.గా పదోన్నతి పొందిన ఎల్.ఎఫ్.ఎల్. హెచ్.ఎం అసోసియేషన్ జిల్లా బాధ్యులు కోగుల రవి బాబులను ప్రత్యేకంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. వి.యం.ఆర్. ఫౌండేషన్ పక్షాన ఫౌండర్ వంగ మహేందర్ రెడ్డి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర శాఖ అధ్యక్షులు యం.డి. అబ్దుల్లాలు ఘనంగా శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేసారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యాభివృద్ధికి కృషి, గురువులకు సన్మానం చేసే అవకాశం లభించడం హర్సనీయమని అన్నారు. ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ, రాష్ట్ర శాఖ ల పక్షాన వి.యం.ఆర్. ఫౌండేషన్ ఫౌండర్ వంగ మహేందర్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ మాట్లాడుతూ… వి.యం.ఆర్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగులు, టై, బెల్ట్స్, పెన్నులు అందజేస్తూ.. విద్యారంగానికి చేస్తున్న సేవలు మరువలేనివని, అభినందనీయని అన్నారు. ఈ కార్యక్రమంలో 5 వందల మంది పదోన్నతి పొందిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల పాల్గొన్నారు.

Related Articles

Back to top button