కథలాపూర్
మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

viswatelangana.com
May 21st, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ, అల్లకొండ లింగగౌడ్, పులి హరిప్రసాద్ ఎండీ ముబిన్, పూండ్ర నారాయణరెడ్డి, పంబల శంకర్, రిక్కల అంజిరెడ్డి జవ్వాజి రవి,ఆకుల సంతోష్, పూండ్ర లవకుమార్, తీగల మధు ముద్రకోల అనిల్, ఎండీ మొయినోద్దీన్ తదితరులు ఉన్నారు.



