కథలాపూర్

పలు గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్

viswatelangana.com

April 29th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం కలికోట, అంబారీపేట, తుర్తి, ఇప్పపల్లి, పోతారం గ్రామాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మే 13 జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. దేశంలో బిజేపి మల్లోసారి అధికారంలో కి వస్తె బిసి,ఎస్సీ,ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు కోసమే 400 సీట్లలో గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి, దేశంలో రాజ్యాంగం బతకడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి. పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో ప్రజలు పేద ప్రజలుగ తీరోగమనం చెందారన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తాడానటానికి నిదర్శనం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులుగా దేశంలో ఐఏఎస్ ఐపీఎస్ ల భర్తీలో ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు 49.50 శాతం ఉద్యోగలు రావాల్సి ఉండగా కేవలం 27% ఉద్యోగాలు దక్కినట్లు తేలిందన్నారు. దేశంలో ఎస్టీ ఎస్సీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం జనాభా లెక్కలు జరిపి రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ పాదయాత్రలో చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుల గణన కోసం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రమే చిత్తశుద్ధి ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం బీసీలకు ఓబిసిలకు రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్నధన్నారు. మండల్ కమిషన్ వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 50% మించకుండా సుప్రీంకోర్టు రిజర్వేషన్ కల్పించుకోవాలని తీర్పు వచ్చినపుడు ఎస్సీ ఎస్టీల కు తోడుగా బీసీ లకు కూడ 27 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు.. ఆనాడు ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడారని ప్రజలంతా గమనించాల్సిందిగా పేర్కొన్నారు. రిజర్వేషన్ రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా అనీ ఆరోపించారు.దేశంలో మొదటి విడత ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజానాడి భాజపాకి వ్యతిరేకంగా ఉందని తెలిసి నరేంద్ర మోడీలో ప్రస్టేషన్కు లోనై గతంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసి ప్రధాని హోదాను మరిచి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. దన్ ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని మోసం చేశారని, జీఎస్టీ పేరిట పేద ప్రజలను దోచుకుంటున్నారని ఎన్నికల్లో బిజెపి వారు మతాన్ని అడ్డుపెట్టుకొని గెలవాలని చూస్తుందన్నారు. శ్రీరాముడు అందరివాడు , ఆదర్శమూర్తి మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని మన తాత ముత్తాతల కాలం నుండి శ్రీరాముడికి కళ్యాణం చేస్తున్నామని శ్రీరాముని కొలుస్తున్నామన్నారు. త్రేతాయుగం నుండి కోలుస్తున్న శ్రీరాముడికి మొన్న స్థాపించిన బిజెపి వారికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. బిజేపి వారు రాముడి అక్షింతలతో రాజకీయం చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతానని అన్నారని, అది సాధ్యం కాదని హరీష్ రావు అనే మాటలు చూస్తే వారు రైతులకు రుణమాఫీ కాకుండా చేయాలని చూస్తున్నారన్నారు. హరీష్ రావు రైతు రుణమాఫీ పై సవాల్ చేస్తూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారని హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసిన బండి సంజయ్ ఏనాడైనా కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ గా మార్చాలని ఆందోళన కానీ ధర్నా కానీ చేశారా అని ప్రశ్నించారు. మన ప్రాంత సమస్యలపై ఏమాత్రం చిత్ర శుద్ధ లేని బండి సంజయ్ కు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు..గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా కలికోట సూరమ్మ చెరువు కోసం అనేక ఆందోళన చేసామని ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో కలికోట సూరమ్మ చెరువు పూర్తి చేసుకుందామని అన్నారు. ఇప్పటికే కుడి ఎడమ కాలువల నిర్మాణానికి సర్వేలు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి అన్నారు. పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టినట్టుగానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఇండియా కూటమిని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలన్నారు. రిజర్వేషన్ల రద్దుకయ్యి మోడీ, అమిత్ షా లు కుట్రలు చేస్తున్నారని, దేశంలో రాజ్యాంగం బతకాలన్న, రిజర్వేషన్లు ఉండాలన్న ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Related Articles

Back to top button