పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రచారం
viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పెగ్గెర్ల, ఊట్ పెల్లి, భూషణ్ రావుపేట గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గెలుపుకొరకు చేతి గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండ నెరవేరుస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినట్టు 6గ్యారెంటీ లలో 4 అమలు చేయడం జరిగిందని మిగతా 2 హామీలను అమలు చేసి తీరుతుందన్నారు. ఆగస్టు 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాయితి నాగరాజు, నాయకులు పులి హరిప్రసాద్, అజీమ్, చెదలు సత్యనారాయణ, కల్లెడ గంగాధర్, గడ్డం స్వామి రెడ్డి, వాకిటి రాజారెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, కూన శ్రీనివాస్, కూన అశోక్, తలారి మోహన్, గడీల గంగాప్రసాద్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



