కథలాపూర్
పలు గ్రామాల్లో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com
April 17th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కథలాపూర్ మండలంలోని పలు గ్రామాలైన చింతకుంట, భూషణరావుపేట, కథలాపూర్, పోసానిపేట, దూలూరు, అంబారీపేట గ్రామాల్లో అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర వారి కళ్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితీ నాగరాజు, పులి హరిప్రసాద్, వెగ్యారపు శ్రీహరి, కల్లెడ గంగాధర్, వాకిటి రాజారెడ్డి, గడ్డం స్వామి రెడ్డి, గడ్డం చిన్నారెడ్డి, కూన శ్రీనివాస్, తలారి మోహన్, కూన అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.



