సమాజ నిర్మాణంలో స్కౌట్స్ పాత్ర కీలకం -ఎస్సై అజయ్
viswatelangana.com
విద్యార్థులను సుశిక్షితులుగా తీర్చిదిద్దడానికి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉపయోగపడుతుందని క్రమశిక్షణ కూడా అలవడుతుందని సమాజ నిర్మాణంలో స్కౌట్స్ పాత్ర కీలకమని రాయికల్ ఎస్సై అజయ్ అన్నారు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమ రూపకర్త బెడెన్ పావెల్ జయంతి వేడుకలను గురువారం రోజు పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్సై అజయ్ మాట్లాడుతూ స్కౌట్ శిక్షణను విద్యార్థులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు మాట్లాడుతూ స్కౌట్ శిక్షణ ద్వారా విద్యార్థులలో చిన్నప్పటినుంచి దేశభక్తి దైవభక్తి క్రమశిక్షణ సామాజిక సేవ అలబడుతుందని అన్నారు విద్యార్థులు ప్రదర్శించిన భిన్నత్వంలో ఏకత్వం మూకీ అభినయం పిరమిడ్స్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ అకాడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్ కుమార్ స్కౌట్ శిక్షకుడు తీగుల్ల గోపాల్ రెడ్డి స్కౌట్ విద్యార్థుల బృందం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు



