సిద్దిపేట

పిఎంజెజెబి వై నామినీకి రెండు లక్షల రూపాయల చెక్కు యూనియన్ బ్యాంకు సిద్దిపేట ఆధ్వర్యంలో అందజేత

viswatelangana.com

May 27th, 2025
సిద్దిపేట (విశ్వతెలంగాణ) :

సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామానికి చెందిన వల్లెపు పోచయ్య తండ్రి భూమయ్య తేదీ 30-3-2025 రోజున అనారోగ్య కారణాల వలన మరణించడం జరిగింది. వల్లెపు పోచయ్య కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సామాజిక భద్రత పథకమైన ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన పథకంలో సంవత్సరంకు 436 రూపాయలతో సిద్దిపేట యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియాలో భీమా నమోదు చేసుకున్నందున అతని భార్య వల్లెపు స్వప్న నామినిగా ఉన్నందున ఆమెకు రెండు లక్షల రూపాయల చెక్కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దిపేట మెయిన్ బ్రాంచ్ మేనేజర్ సురేష్ సార్ వారి ఆధ్వర్యంలో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ సురేష్ గారు, సీఎఫ్ ఎల్ సిద్దిపేట రూరల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, సాయి కృష్ణ, రాకేష్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిసి ఏరియా మేనేజర్ రాజు, బీసీ హరినాథ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Back to top button