కోరుట్ల
పెంచిన స్టూడెంట్ పాస్ ధరలు తక్షణమే తగ్గించాలి: కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్

viswatelangana.com
June 24th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు స్కూల్, కాలేజ్‌లకు సమయానికి చేరుకునేలా బస్సులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ప్రణాళికతో బస్సులు నడపాలి అని సూచించారు. అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోకి నూతన బస్సులు ప్రవేశపెట్టాలని, అవసరమయ్యే చోట్ల రిక్వెస్ట్ స్టాప్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇటీవల పెరిగిన విద్యార్థి పాస్ ధరలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, స్టూడెంట్ పాస్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలి అంటూ ప్రభుత్వాన్ని డా. సంజయ్ గారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆర్.ఏం రాజు, డివిఏం భూపతి రెడ్డి, కోరుట్ల డిపో మేనేజర్ తదితర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.



