జగిత్యాల
పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం
viswatelangana.com
May 14th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి లో మంగళవారం బేతి రామ్మోహన్ రెడ్డికి చెందిన తన పశువుల కొట్టంలో అగ్ని ప్రమాదం జరిగింది. తన కొట్టంలో ఉన్న గడ్డి మోపులకి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించగా అందులో ఉన్న గడ్డిమోపులు అగ్నికి ఆహుతి అయినట్టు బాధితుడు తెలిపాడు. సుమారు 60 వేలు విలువ చేసే గడ్డిమోపులు అగ్నికి ఆహుతి అయినట్టు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మంటలను ఆర్పి వేయడంతో పెను ప్రమాదం తప్పింది.



